ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ.. గాయంతో స్మిత్ దూరం

SMTV Desk 2017-10-07 18:32:00   Australia team, Captain Steve Smith, Injured.

రాంచి, అక్టోబర్ 7 : భారత్‌తో టీ-20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆసీస్ జట్టును మరో గాయం ఆందోళనకు గురిచేసింది. టీ20 మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న వేళ ప్రాక్టీస్‌ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ భుజానికి గాయమైంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మ్యాచుకు అందుబాటులో ఉండొచ్చని వైద్యులు తెలిపారు. గాయం పెద్ద ఇబ్బంది పెట్టకపోయినా ఆసీస్‌ బోర్డు స్మిత్‌కు విశ్రాంతి ఇవ్వాలని నిశ్చయించుకుంది. ఎందుకంటే త్వరలో ఇంగ్లాండ్‌తో ఆ జట్టు ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ ఆడనుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే స్మిత్‌ను స్వదేశానికి పంపించి వేసినట్లు తెలుస్తోంది. అయితే స్మిత్ స్థానంలో ఎవరిని ఉంచాలో ఇంకా ప్రకటించలేదు. సారథ్య బాధ్యతలను డేవిడ్‌ వార్నర్‌ అందుకునే అవకాశం ఉంది కానీ భారత పిచ్‌లపై ఐపీఎల్‌ ద్వారా అనుభవాన్ని సంపాదించుకున్న స్మిత్‌ దూరమవ్వడం ఆ జట్టుకు కోలుకోలేని దెబ్బే.