నెహ్రా ఎంపికపై క్రీడా పండితుల పెదవి విరుపు..

SMTV Desk 2017-10-07 16:42:34  Cricketer Aishish Nehra, T20 Series selection, australia.

రాంచి, అక్టోబర్ 7 : అంతా సాఫీగా సాగుతున్న తరుణంలో ఆశీష్‌ నెహ్రా సెలెక్షన్‌ అర్థం లేనిదని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. ఫిట్‌నెస్‌, ఫీల్డింగ్‌కు ప్రాధాన్యతను ఇచ్చి భవిష్యత్‌ జట్టును రూపొందిస్తున్నామని చెప్పే సెలెక్టర్లు నెహ్రా ఎంపికతో తప్పు చేసినట్టేనని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బెంగళూరులోని ఎన్‌సీఏలో కొందరు క్రికెటర్లు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో విఫలమయ్యారని వార్తలొచ్చాయి. మరి నెహ్రా ఫిట్‌గా ఉన్నట్టు తేల్చారా..? ఇలా ఆటగాళ్ల పట్ల వివక్ష చూపడం జట్టులో అభద్రతాభావాన్ని పెంచడమే కాదు అపనమ్మకాలకూ తావిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. మొత్తంగా నెహ్రా ఎంపిక.. జట్టును కొన్ని ఏళ్లు వెనక్కు తీసుకుపోయింది. టీ-20 సిరీస్‌లో ఆస్ట్రేలియా ఎదురీదక తప్పదు. వన్డే సిరీస్‌ కోల్పోయిన జట్టులో ఆసిస్ కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కానీ దూకుడు మీదున్న భారత్‌ను నిలువరించాలంటే కంగారూల టాపార్డర్‌ ఎంతో శ్రమించాల్సి ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు.