అమెరికాలో రిలయన్స్ ఆస్తుల అమ్మకం......

SMTV Desk 2017-10-07 16:38:29  Reliance Industries, Reliance Shale gas property

న్యూ ఢిల్లీ, అక్టోబర్ 7 : అమెరికాలో తనకు ఉన్న 3 షేల్ గ్యాస్ ఆస్తుల్లో ఒకదాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) 126 మిలియన్ డాలర్ల(దాదాపు రూ. 800 కోట్లు)కు విక్రయించింది. ఈగల్ ఫోర్డ్ షేల్ ప్లేలో పయనీర్ నేచురల్ రిసోర్సెస్ లో 45%, షేవ్రాన్ లో 40%, మార్సెలెస్ షేల్ ప్లేలోని కరిజో ఆయిల్ అండ్ గ్యాస్ లో 60% రిలయన్స్ కి వాటాలున్నాయి. ప్రస్తుతం చివరి కంపెనీ లోని వాటాను కాల్సిన్ వెంచర్స్ ఎల్ఎల్ సీకు అనుబంద సంస్థ అయిన బీకేవి ఎల్ఎల్ సీ కు అమ్మేసింది. ఈ నేపధ్యంలో రిలయన్స్ అనుబంధ సంస్థ రిలయన్స్ మార్సిలస్ ఒప్పందంపై సంతకం పెట్టగా, అదనంగా 11.25 డాలర్లు చెల్లిస్తారు. ఈ ఆస్తుల విక్రయ౦ 2017-18 త్రైమాసికం నాటికి పూర్తి కావొచ్చు అని సంస్థ వెల్లడించింది.