మానవత్వాన్ని చాటుకున్న సుష్మాజీ..

SMTV Desk 2017-10-07 15:55:55  Indian Foreign Minister, Sushma Swaraj, Medical visa, Pakisthan

న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో బాధ పడుతున్న ఇద్దరు పాకిస్థానీయులకు మెడికల్ వీసా మంజూరు చేశారు. లాహోర్‌కు చెందిన ఉజైర్‌ హుమాయూన్‌ అనే వ్యక్తి కుమార్తె గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా.. ఆ చిన్నారికి ఆపరేషన్ నిర్వహించాల్సి ఉంది. అలాగే తన తండ్రికి లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయించడానికి నూర్మా హబీబ్‌ అనే మహిళ.. తమకు వీసా మంజూరు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ రెండు దరఖాస్తులను పరిశీలించిన సుష్మా.. మానవతాదృక్పథంతో ఈ ఇద్దరికీ మెడికల్ వీసాలను మంజూరు చేశారు. అంతేకాకుండా వారి బంధువులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.