మోదీని పెళ్లి చేసుకుంటా..

SMTV Desk 2017-10-07 15:29:18  Prime Minister, Modi, Marriage prposal.

న్యూఢిల్లీ, అక్టోబర్ 7 : పెళ్ల౦టూ చేసుకుంటే మోదీనే చేసుకుంటానని ఓ మహిళ ధర్నాకు దిగింది. అంతేకాకుండా కట్నం కూడా ఇస్తానంటూ ప్రకటించింది. పూర్తి వివరాలలోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన జయశాంతి(45) అనే మహిళకు 1989 లో వివాహం కాగా.. ఆమె భర్త ఎక్కడికో వెళ్ళిపోయాడు. అప్పటి నుండి ఆమె ఒంటరిగా నివసిస్తోంది. ఆ తరువాత ఆమెను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది యువకులు ముందుకు వచ్చినా తానూ నిరాకరించింది. మోదీని పెళ్లి చేసుకోవాలని ఉందంటూ ఆమె మీడియాకు తెలిపింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సమాధానం కోసం ఎదురుచూస్తూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. అంతేకాదు తనకున్న ఆస్తులన్నీ అమ్మి మోదీకి రెండు కోట్ల రూపాయలను కట్నంగా ఇస్తానని కూడా తెలపడం విశేషం.