ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి...కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2017-10-07 15:10:11  Aadhaar Card, Post Office, Deposit

న్యూఢిల్లీ, అక్టోబర్ 07: అక్రమాల నిరోధం కోసం ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని రకాల పోస్ట్ ఆఫీస్ డిపాజిట్లకు ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజాభవిష్యనిధి పీపీఎస్ సహా జాతీయ పొదుపు సర్టిఫికెట్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాల ప్రారంభానికి ఆధార్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ మేరకు నాలుగు వేర్వేరు గెజిట్ లను విడుదల చేసిన కేంద్ర ఆర్థిక శాఖ, ప్రస్తుత పోస్ట్ ఆఫీస్ ఖాతా దారులకు ఇందుకోసం డిసెంబర్ 31 వరకు తుది గడువు విధించింది. సబ్సిడీ వంటి ప్రభుత్వ ప్రయోజనాలు బినామీలకు కాకుండా అర్హులకు అందేలా చేయడం సహా నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్రం ఇప్పటికే 35 శాఖలకు చెందిన 135 పథకాలకు ఆధార్ ను తప్పనిసరి చేసింది.