14వ ఐరోపా సమాఖ్య సదస్సులో భారత ప్రధాని మోదీ

SMTV Desk 2017-10-07 13:16:49  Indian Prime Minister Narendra Modi, participated in the 14th European Union Conference

న్యూఢిల్లీ, అక్టోబర్ 07 : పరస్పర ద్వైపాక్షిక, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్ - ఐరోపా సమాఖ్య తీర్మానంతో నిర్ణయించాయి. ఢిల్లీలో జరిగిన 14వ ఐరోపా సమాఖ్య సదస్సులో పాల్గొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐరోపా అధ్యక్షుడు డొనాల్డ్‌ టస్క్‌, ఐరోపా కమిషన్‌ అధ్యక్షుడు జీన్‌ క్లాడ్‌ జంకర్‌తో శుక్రవారం ఇరువైపులా పరస్పర బంధాల బలోపెతంపై చర్చించారు. ఈ సందర్భంగా బెంగుళూరుకు 500 మిలియన్ల యురోలా ఆర్థిక సాయం చేయడం ప్రపంచ సౌర విద్యుత్ రంగంలో కలిసి పని చేయడం సహా భారత్ - ఐరోపా సమాఖ్య మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయి. ఐరోపా సమాఖ్యతో భారత సంబంధాలు చాలా సుదీర్ఘమన్న ప్రధాని మోదీ వాటిని మరింత బలోపేతం చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తారణ, తీవ్రవాద నిరోధంపై సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని భావిస్తున్నట్లు మోదీ ఆకాంక్షించారు.