ధనాధన్ సమరం నేడే... గెలుపు గుర్రాలు ఎవరో..?

SMTV Desk 2017-10-07 13:04:27  T 20 series, Cricket match, Team India

రాంచి, అక్టోబర్ 7 : ప్రస్తుతం టీం ఇండియా చాలా బలంగా ఉంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ లో 4-1 తో ఆస్ట్రేలియాను మట్టికరిపించి కొత్త ఫార్మాట్ లో విజయం కోసం సిద్ధమవుతుంది. మూడు మ్యాచ్ ల T-20 సిరీస్.. తొలి మ్యాచ్ ఈ రోజు రాత్రి 7.00 గంటలకు ధోని సొంతగడ్డ రాంచిలో జరుగబోతుంది. చాలా రోజుల తరువాత శిఖర్ ధావన్ జట్టులోకి రావడం తప్ప భారత్ జట్టులో పెద్దగా మార్పేమీ లేదు. భారత్.. వన్డేల్లో సాధించిన విజయాలతో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. కోహ్లి గత సిరీస్ ల్లో ఒక్క వన్డే తప్ప పెద్దగా ఆడింది లేదు. ధోని, జాదవ్, పాండ్య గత మ్యాచ్ ల్లో బాగానే రాణించడంతో మిడిల్ ఆర్డర్ బలంగా ఉంది. మొదటగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ జోడిగా ఇన్నింగ్స్ ను ప్రారంభి౦చనున్నారు. అయితే 4 వ స్థానంలో మనీష్ పాండే ను ఆడనిస్తారా..! లేక లోకేష్ రాహుల్ కి అవకాశం ఇస్తారా చూడాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ విభాగంలో చాహల్ చోటు ఖాయం కాగా, మరో స్పిన్నర్ కోసం అక్షర్, కులదీప్ పోటీలో ఉన్నారు. ఇంకా నెహ్రా ని సిరీస్ కి ఎంపిక చేశారు కాబట్టి అతను తుది జట్టులో చోటు దక్కనుంది... కాబట్టి పేస్ విభాగంలో ఒకరు తుది జట్టులో ఉండరు. బుమ్రా T-20 స్పెషలిస్ట్ కావున భువనేశ్వర్ ఉండకపోవుచ్చు. కానీ ఆస్ట్రేలియా జట్టు వన్డేల్లో పాల్గొనని నలుగురు కొత్త ఆటగాళ్ళని బరిలోకి దింపింది. వారు డాన్ క్రిస్టియన్, మోయోజుస్ హెన్రిక్స్, బెహరన్ డార్ఫ్, వికెట్ కీపర్ టీం పైన్ జట్టులో ఉన్నారు. గత మ్యాచ్చుల్లో స్మిత్ ఫాం ఆ జట్టుని ఆందోళన పరుస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ నుండి అతను వరుసగా విఫలమవుతున్నాడు. ఒక విధంగా ఆ ప్రభావం కెప్టెన్సీ మీద కూడా పడుతుంది. వన్డే సిరీస్ లో పేస్ విభాగం కోల్టర్ నైల్, మరో పేసర్ రిచర్డ్సన్, మూడో పేసర్ గా బెహ్రాన్ డార్ఫ్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ఇంకా రికార్డుల పరంగా చూస్తే భారత్ -ఆస్ట్రేలియాల మద్య పదమూడు టీ-20 మ్యాచ్ లు జరగగా భారత్ 9 నెగ్గి 4 ఓడింది.... రికార్డుల పరంగా.. టీం ఫాం పరంగా భారత్ పటిష్ట స్ధితిలో ఉన్నప్పటకీ ఒక్క ఓవర్లో ఫలితాలు మారిపోయి ఈ ఆటలో రెండు టీంలు గెలుపు కోసం శ్రమించక తప్పదు.