ఫేక్ న్యూస్‌పై అడ్డుక‌ట్ట వేయనున్న ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు

SMTV Desk 2017-10-06 23:55:35  afce book new feature, fake news, latest news, facebook team, news source

హైదరాబాద్ అక్టోబర్ 6: వెబ్ సైట్ లలో వైర‌ల్ అవుతున్న ఫేక్ న్యూస్‌పై చర్యలు తీసుకుంటున్న ఫేస్ బుక్ టీం. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వ‌చ్చే అవాస్తవ వార్త‌ల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు, ఆ సంస్థ ఓ కొత్త బటన్‌ను తన ప్లాట్‌ఫామ్‌ మీద టెస్ట్‌ చేస్తోంది. ఫేస్‌బుక్‌లో పెట్టే వార్త‌ల సోర్స్ కు సంబంధించి యూజ‌ర్లు సమాచారం పొందవ‌చ్చు. ఫేస్‌బుక్ ప్ర‌వేశ‌పెడుతోన్న ఈ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఆ పేజీ నుంచి బయటికి వెళ్లకుండానే న్యూస్‌ ఆర్టికల్‌ సోర్స్‌ గురించి యూజర్లు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. త‌మ వెబ్‌సైట్‌లో వ‌చ్చే న్యూస్‌ ఎంత వరకు నిజ‌మో, ఆ న్యూస్ ఏ వెబ్‌సైట్ నుంచి వ‌చ్చిందో సులువుగా తెలుసుకోవడానికి ఈ కొత్త ఫీచ‌ర్ తెచ్చిన‌ట్లు ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు తెలిపారు. సోష‌ల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ ఇప్ప‌టికే ఎన్నో కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే ఈ ఫీచర్ ఫేస్‌బుక్ యూసర్లకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.