నటుడిని దొంగ అనుకోని కాల్పులు జరిపిన పోలీస్...

SMTV Desk 2017-10-06 18:55:34  America, indian bank, hollywood actor, hero Jeff Deff

అమెరికా,అక్టోబర్ 6: దొంగ అనుకోని ఓ నటుడిపై కాల్పులు జరిపిన సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... హాలీవుడ్ నటుడు జెఫ్ డెఫ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రాన్ని అమెరికాలోని ఇండియానా వద్ద ఉన్న స్థానిక బ్యాంకు దగ్గర చిత్ర బృందం షూటింగ్ నిర్మిస్తుంది. అయితే ఈ చిత్రంలో జెఫ్ దొంగ పాత్రలో నటిస్తున్నారు. ఓ సన్నివేశంలో భాగంగా దొంగ వేషంలో జెఫ్ ఆ బ్యాంకు లోపలికి ఒక డమ్మీ తుపాకి పట్టుకొని దొంగతనానికి వెళ్ళగా, అక్కడే ఉన్న పోలీసు నిజమైన దొంగ అనుకోని అతనిపై తుపాకి గురిపెట్టాడు. అది గమనించిన చిత్ర బృందం, అతను దొంగ కాదని, అది నిజమైన గన్ కాదని.. ఎంత అరిచినా పట్టించుకోకుండా ఆ పోలీస్ జెఫ్ పై కాల్పులు జరిపాడు. కానీ అతని అదృష్టం బాగుండటం వల్ల బుల్లెట్ పక్కనే ఉన్న గోడకు తగిలి జెఫ్ ప్రాణాలతో బయటపడ్డాడు.