5 రోజుల పెరోల్ పై బయటకు శశికళ

SMTV Desk 2017-10-06 15:43:36  Chief Minister Jayalalithaa Nachchali Shashikala, Parole is Manjur Natarajan

చెన్నై, అక్టోబర్ 06 : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు 5 రోజుల పెరోల్ మంజూరైంది. అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్ ను చూసేందుకు పెరోల్ ఇవ్వాలన్న శశికళ అభ్యర్ధనపై పరప్పన అగ్రహార జైలు అధికారులు సానుకూలంగా స్పందించారు. పెరోల్ పై విడుదలయ్యే ఆమెను తీసుకెళ్ళేందుకు టీడీపీ దినకరన్ సహా ఆయన అనుచరులు బెంగుళూరులోని జైలుకు చేరుకున్నారు. అక్రమ ఆస్తుల కేసులో దోషిగా తేలిన శశికళ నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భర్త నటరాజన్ కు త్వరలో కాలేయ మార్పిడి జరగనున్న దృశ్య 15 రోజులు పెరోల్ మంజూరు చేయాలని శశికళ జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అభ్యర్ధనపై స్పందించిన అధికారులు 5 రోజుల పెరోల్ మాత్రమే మంజూరు చేశారు.