అవును! ఉగ్రవాదులతో సంబంధాలున్నాయి.. : పాకిస్థాన్

SMTV Desk 2017-10-06 15:30:29  Pakistan, Inter Services Intelligence, Director General of Public Relations, Asif Ghufur.

ఇస్లామాబాద్, అక్టోబర్ 6 : పాకిస్థాన్ ఎట్టకేలకు ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) తో సంబంధాలున్నాయని అంగీకరించింది. కాని అది కేవలం సంబంధం మాత్రమే.. తాము ఉగ్రవాదులకు మద్దతునిస్తున్నట్లు కాదని స్పష్టం చేసింది. ఇటీవల అమెరికా.. పాకిస్థాన్ కు ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై ఐఎస్ఐ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆసిఫ్‌ గఫూర్‌ మాట్లాడుతూ.. "ఉగ్రవాదులతో సంబంధాలుండడం వేరు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వేరు" అంటూ పేర్కొన్నారు. కాగా ఇంతకాలం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ వచ్చిన పాక్.. తాజాగా ఇప్పుడు నిజాన్ని ఒప్పుకుంది. అంతేకాకుండా మిలిటెంట్ గ్రూపులను జనజీవన స్రవంతిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు ఇదొక్కటే మార్గమని పాక్ అంటోంది.