కారు ప్రమాదం నుంచి బయట పడ్డ మోహన్ భగవత్

SMTV Desk 2017-10-06 15:11:56  RSS chief Mohan Bhagwat, Conway, Car accident

మథుర, అక్టోబర్ 06 : ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ కు తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లో పరస్పరం రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఆయన వాహనంలోని కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. బృందావనంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భగవత్‌ శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి బయల్దేరారు. మార్గం మధ్యలో మథుర జిల్లాలోని సురీర్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకోగా, భగవత్‌ సహా ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలిపింది. ప్రమాదానికి గురైన వాహనాలను క్రేన్ సహాయంతో తరలించారు.