హత్యకు గురైన గౌరీ లంకేశ్‌కు ప్రతిష్ఠాత్మక గ్లోబల్ అవార్డు..

SMTV Desk 2017-10-06 10:57:49   Journalist Gouri Lankesh, Global Award, Gualai Ismail, Reach All Women in War.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6 : గత నెలలో కాల్పులు జరిగి హత్యకు గురైన ప్రముఖ లేడి కన్నడ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును హత్యకు గురైన రష్యాకు చెందిన ప్రముఖ రిపోర్టర్, రాజకీయ కార్యకర్త పేరు మీద ఇస్తున్నారు. ఈ అవార్డు దక్కిన తొలి భారతీయురాలు గౌరీనే కావడం విశేషం. కాగా ఈ పురస్కారానికి కావలసిన వ్యక్తులకు ధైర్యం, పోరాట పటిమ ఉన్న వ్యక్తుల్లో గౌరీ ఒకరని అవార్డు కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా గౌరీ లంకేశ్‌ సోదరి మాట్లాడుతూ.. "ప్రజల కోసం పోరాడే వారికి ఈ అవార్డు నైతికంగా మద్దతునిస్తుంది. ఈ అవార్డు కేవలం గౌరీది మాత్రమే కాదు ఆమె తరుపున నిలబడిన వారందరికీ ఈ అవార్డు అంకితం" అంటూ తెలిపారు. రీచ్ ఆల్ విమెన్ ఇన్ వార్ (రా ఇన్ వార్) అన్నా పొలిట్కోవస్కాయా అవార్డును హత్యా బెదిరింపులు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ శాంతి కార్యకర్త గులాలై ఇస్మాయిల్ (31)తో కలిసి గౌరీ లంకేశ్ (55)కు ప్రకటించారు.