షారుఖ్ ఖాన్ ని కలిసిన హరీష్ శంకర్

SMTV Desk 2017-10-05 23:16:29  king khan, sharukh khan, harish shankar, bollywood star

హైదరాబాద్ అక్టోబర్ 5: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని హరీష్ శంకర్ కలిసారు. ఈ సందర్బంగా హరీష్ ట్వీట్ చేస్తూ, ‘నా జీవితంలో మరచిపోలేని సమయం, గుర్తుండిపోయే సంభాషణ చేసిన కింగ్ ఖాన్ కు ఎన్నో ధన్యవాదాలు.. లవ్ యూ’ అని సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా షారూక్ ను హరీష్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎక్కడ షారూక్ ఖాన్ ని కలిశారనే విషయాన్ని హరీష్ పోస్ట్ లో ప్రస్తావించలేదు. హరీష్ చివరగా ‘దువ్వాడ జగన్నాధం’ చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత మళ్ళి ఏ సినిమా మొదలు పెట్టినట్టు సమాచారం లేదు.