రామ్ గోపాల్ వర్మ హిందీ ‘శివ’ చిత్ర జ్ఞాపకాలు

SMTV Desk 2017-10-05 22:18:15  shiva, nagarjuna, amrish puri, amithab bachhan, ram gopal varma

హైదరాబాద్ అక్టోబర్ 5: ‘శివ’ సినిమా విడుదలై 25 సంవత్సరాలు దాటిన ఆ సినిమా చేసిన అద్భుతాలు తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటికి మర్చిపోలేదు. అటు నాగార్జున కెరీర్లో ఇటు, రాంగోపాల్ వర్మ కెరీర్లో మర్చిపోలేని ఘన విజయాన్ని అందించింది ‘శివ’ సినిమా. అప్పటి ఈ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ ఫొటోని పోస్ట్ చేశారు. హిందీ ‘శివ’ చిత్రం ద్వారా నటుడు నాగార్జున బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చే సందర్భంలో ముంబైలో నాడు ఏర్పాటు చేసిన కార్యక్రమం లో తీసిన ఫొటోలను పోస్ట్ చేశారు. ముంబైలో నాడు నిర్వహించిన హిందీ ‘శివ’ ప్రీమియర్ షో కు సెలెక్టెడ్ ఆడియన్స్ ను మాత్రమే ఆహ్వానించినట్టు అందులో ఉంది. ఆ ప్రీమియర్ షోకు హాజరైన ముఖ్యఅతిథుల్లో బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ ఒకరు. నాటి నటుడు అమ్రిష్ పురి, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ తదితరులు ఈ ఫొటోలో కనిపిస్తారు.