సాహిత్యరంగంలో బ్రిటన్ శాస్రవేత్తకు నోబెల్

SMTV Desk 2017-10-05 18:27:40   Literary field, british scientist, nobel prize, writer Kazuo Ishiguro.

న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : సాహిత్య రంగ౦లో అతి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి ఈ ఏడాది బ్రిటన్‌కు చెందిన ప్రముఖ రచయిత "కజువో ఇషిగురో" ను వరించింది. ఆయన రాసిన రచనలలో అద్భుతమైన భావోద్వేగ శక్తి ఉంటుందని.. స్వీడిష్ అకాడమీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే ఇషిగురో 8 పుస్తకాలు రాయగా వాటిని దాదాపు 40 భాషల్లోకి అనువదించారు. అందులో "ది రిమైన్స్ ఆఫ్ ది డే", "నెవర్ లెట్ మి గో" అనే నవలలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి. అంతేకాదు ది రిమైన్స్ ఆఫ్ ది డే అనే నవల ఆధారంగా అప్పట్లో సినిమాను కూడా తెరకెక్కించారు.