ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్ లో మహిళ అంపైర్...

SMTV Desk 2017-10-05 17:47:16  Australia ODI match, Australia, Claire Polosak, criket umpire

సిడ్నీ, అక్టోబర్ 5: క్రికెట్ ఆటపై ఆసక్తి గల మహిళ క్లేర్ పోలోసాక్... తానెప్పుడు క్రికెట్ ఆడకపోయినా, కొన్ని సార్లు అంపైర్ పరీక్ష తప్పినా, ప్రస్తుతం ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ వన్ డే మ్యాచ్ కి అంపైర్ గా వ్యవహరించనున్నారు. ఈ ఆదివారం న్యూ సౌత్ వేల్స్ క్రికెట్ ఆస్ట్రేలియా-11 మ్యాచ్ జరుగనుంది. సాంప్రదాయ అంపైర్ అయిన హర్స్ట్ విల్లె ఓవల్ లో పాల్ విల్సన్ తో పాటుగా పోలోసాక్ పాల్గొంటారు. ఈ సంవత్సరం ఇంగ్లాండ్ లో జరిగిన మహిళా వరల్డ్ కప్ లో నాలుగు మ్యాచ్ లలో పోలోసాక్ నే అంపైర్ గా బాధ్యతలు నిర్వహించింది.