శశికళ పెరోల్ పై తొలగిన అడ్డంకులు

SMTV Desk 2017-10-05 17:46:23  shashikala, perol issue, bangalore parappana jail.

చెన్నై, అక్టోబర్ 5 : బెంగుళూరు పరప్పన జైలులో శిక్షను అనుభవిస్తున్న శశికళకు కాస్త ఊరట లభించింది. తనకు పెరోల్ మంజూరు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ జైలు అధికారులకు పోలీసులు లేఖ రాశారు. ఇటీవల శశికళ భర్త తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఈ క్రమ౦లో 15 రోజుల పెరోల్ కావాలంటూ శశికళ తరుపున న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆమె పెరోల్ కు ఓ అడ్డంకి తొలగినట్టైంది. కాని కేవలం నాలుగైదు రోజులు మాత్రమే ఆమెకు పెరోల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని డాక్యుమెంట్లను సమర్పిస్తే శశికళకు పెరోల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.