జ్యోతిష్యం అనేది మూఢ నమ్మకం కాదు: టీబీ జయచంద్ర

SMTV Desk 2017-10-05 17:10:07  karnataka government, Justice minister TB Jayachandra,

న్యూడిల్లీ, అక్టోబర్ 5 : కర్ణాటక ప్రభుత్వం గత నెలలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఒక బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దుష్టశక్తుల పేరిట మూఢవిశ్వాసాలను ప్రేరేపించే వారికి ఈ చట్టం కఠినమైన శిక్షను విధిస్తుంది. తాజాగా కర్ణాటక న్యాయ మంత్రి టీబీ జయచంద్ర మాట్లాడుతూ ...జ్యోతిషం అనేది మూఢ నమ్మకం కాదనీ.. అదీ విజ్ఞాన శాస్త్రంలో భాగమని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూఢవిశ్వాసాల వ్యతిరేక బిల్లులో దాన్ని చేర్చబోమని స్పష్టం చేశారు. అయితే కొంతమంది హేతువాదులు మాత్రం మంత్రి గారూ ఆస్ట్రానమీని, ఆస్ట్రాలజీ అనుకుంటున్నారేమో అని వ్యంగ్యంగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారు.