ట్విట్టర్ ఫాలోవర్ల అగ్రస్థానంలో ట్రంప్, సుష్మాజీ

SMTV Desk 2017-10-05 15:59:55  twitter followers, donald trump, sushma swaraj

న్యూఢిల్లీ, అక్టోబర్ 5 : ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలో అవుతున్న జాబితాలో అగ్రస్థానంలో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిలిచారు. ఆయన ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లు కాగా, రెండవ స్థానంలో పోప్ ఫ్రాన్సిస్ (39 మిలియన్లు) నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ 35 మిలియన్ల ఫాలోయర్లతో మూడవ స్థానంలో నిలిచినట్లు ట్విప్లోమసీ నివేదిక వెల్లడించింది. నాలుగో స్థానంలో భారత ప్రధానమంత్రి కార్యాలయం 21 మిలియన్ల మంది ఫాలోయర్లతో నిలవడం విశేషం. ఇక మహిళా నేతలను అనుసరిస్తున్న వారిలో మొదటిస్థాన౦లో భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ నిలిచారు. సుష్మాజీని ట్విట్టర్ లో సుమారు 9.6 మిలియన్ల మంది ఫాలోవర్లు అనుసరిస్తున్నారు.