సౌర విద్యుత్పత్తిలో తెలంగాణ అగ్రస్థానం

SMTV Desk 2017-10-05 13:09:52  Telangana, Solar power, CM. KCR, Transmission corporation of telanganga

హైదరాబాద్, అక్టోబర్ 5: సౌర విద్యుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానానికి చేరుకుంది. ఈ విద్యుత్పత్తి రోజురోజుకి గణనీయంగా పెరగడంతో తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థలకు కాస్త వూరట లభించింది. 2016 సెప్టెంబరు 25న తెలంగాణలో అన్ని వర్గాల కనెక్షన్లకూ కలిపి 5,243 మెగావాట్లు విద్యుత్తు వినియోగించుకోగా, ఈఏడాది అదేరోజున 9,109 మెగావాట్లు వినియోగించారు. రాష్ట్రంలో గత నెల జులై చివరివారం నుంచి మెదక్‌, నల్గొండ, కరీంనగర్‌తో పాటు పాత జిల్లాల పరిధిలో సేద్యానికి 24 గంటలూ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. వ్యవసాయ బోర్లకు 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న౦దువల్లనే ఈ పెరుగుదల వచ్చిందని ట్రాన్స్‌కో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదించింది. ప్రస్తుతం ఒక రోజుకి గరిష్ఠంగా 2,357 మెగావాట్ల విద్యుత్, మరో 4 నెలల్లో అదనంగా వెయ్యి మెగావాట్లు పెరిగి జనవరి వరకు 3400 మెగావాట్ల సౌరవిద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు.