తాజ్ మహల్ వద్ద మరో అద్భుతం...

SMTV Desk 2017-10-05 11:23:06  New delhi, Agra, Tajmahal

న్యూఢిల్లీ, అక్టోబర్ 5: చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్ కోసం జ్ఞాపకార్ధంగా నిర్మించిన తాజ్ మహల్ లో నేటి రాత్రి మరో అద్భుతం జరగనుంది. నేడు శరద్ పూర్ణిమ సందర్భంగా పున్నమి చంద్రుడు వెలుగులను విరజిమ్మే రోజు. ఈ పున్నమి శరదృతువులో ఆశ్వయుజ మాసంలో మాత్రమే రావడం విశేషం. అయితే ఈ నిండు చంద్రుడు ప్రపంచంలోని ఏడు వింతల్లోని తాజ్ మహల్ పై పడడం ఓ అద్భుతంగా భావిస్తారు. ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా పేరొందిన తాజ్ మహల్ లో తెల్లటి పాలరాయితో చేసిన సమాధి గోపురంపై పడే పున్నమి చంద్రుని ప్రకాశించే వెలుగులను చూడటానికి రెండు కళ్ళు చాలావంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ అద్భుతాన్ని తిలకించడానికి ఆగ్రాకు దేశ విదేశీ పర్యాటకులు తరలి వస్తున్నారు. నేటి రాత్రి 8.30 నుంచి 12.30 గంటల వరకూ ఈ పూర్ణ చంద్రుని కాంతులు తాజ్ మహల్ పై చూడవచ్చని శాస్త్రజ్ఞులు తెలిపారు.