కేంద్ర ప్రభుత్వ బాధ్యతల్ని నెరవేరుస్తా: జస్టిస్‌ రోహిణి

SMTV Desk 2017-10-04 18:31:31  OBC, Chairperson of the Taxation Commission,Former Chief Justice of Justice G. Rohani

న్యూఢిల్లీ, అక్టోబర్ 04 : ఓబీసీ రిజర్వేషన్ల వర్గీకరణ పై కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశ చరిత్రలో ముఖ్యమైన అంశమని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి. రోహిణి వ్యాఖ్యానించారు. ఓబీసీ వర్గీకరణ పై రాష్ట్రపతి నియమించిన ఐదుగురు సభ్యుల కమిషన్ కు నేతృత్వం వహించిన జస్టిస్‌ రోహిణి కేంద్ర ప్రభుత్వం అప్పగించిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తానని ఆమె వెల్లడించారు. ఈ మేరకు తనపై చాలా పెద్ద బాధ్యత పెట్టారంటూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవలే పదవీ విరమణ చేసిన ఆమె తన నియామకం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని ఆమె అన్నారు.