భారీ ఆఫర్లను ప్రకటించిన అమెజాన్..

SMTV Desk 2017-10-04 18:26:24  Amazon, Great Indian Festival, festival offers.

న్యూఢిల్లీ, అక్టోబర్ 4 : దీపావళి పండగ వస్తూ వస్తూ పండగ ఆఫర్లను తెచ్చింది. అమెజాన్ లో "గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్" లో భాగంగా పలు ఆఫర్లను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా పలు రకాల ఉత్పత్తులపై అధికంగా డిస్కౌంట్లను అందించనుంది. అంతేకాకుండా సిటీ బ్యాంకు క్రెడిట్‌ కార్డు, డెబిట్‌ కార్డుల‌తో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం క్యాష్‌బ్యాక్‌ను అందుకోవచ్చు. దీనిలో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్‌లపై అలాగే బ్యూటీ, బేబీ కేర్‌ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్లను అంది౦చనుంది. ఈ ఆఫర్లు ఈరోజు నుండి ఈ నెల 8 వ‌ర‌కు మాత్రమే అందుబాటులో ఉంటాయి. * అమెజాన్ సుమారు 160 రకాల మోడల్ స్మార్ట్ ఫోన్లపై డిస్కౌంట్ ను అందించనుంది. *100 కన్నా ఎక్కువ ఎల‌క్ట్రానిక్ ఉత్పత్తులపై ఈ ఆఫర్ వర్తించనుంది. *యాపిల్‌, శాంసంగ్‌, సోనీ, హెచ్‌పీ, ఎల్‌జీ, నోకియా, బ్లాక్‌బెర్రీ వంటి ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులపై కూడా పొందవచ్చు.