తాజాగా లాలూకు సమన్లు జారీ చేసిన సీబీఐ

SMTV Desk 2017-10-04 16:20:43  Railway hotels, The contract, RJD chief Lalu Prasad Yadav, Son Tejaswi Yadav

పట్నా, అక్టోబర్ 04 : రైల్వే హోటల్ల నిర్వహణ కాంట్రాక్టుల విషయంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌, ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్ లను అక్టోబర్ 5, 6 తేదీల్లో తమ ముందు హాజరు కావాలని సీబీఐ తాజాగా సమన్లు జారీ చేసింది. 15 రోజుల సమయం కావాలని ఇటీవల ఇద్దరు కేంద్ర దర్యాప్తు సంస్థకు విజ్ఞప్తి చేయగా, తిరస్కరించిన సీబీఐ లాలూను అక్టోబర్ 3న, తేజస్వీ యాదవ్ ను అక్టోబర్ 4న హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. ఆ సమన్ల ప్రకారం మంగళవారం లాలు హాజరు కావాల్సి ఉండగా మరింత సమయం కోరారు. ఈ నేపథ్యంలో మళ్లీ సమన్లు జారీ చేసిన సీబీఐ నేడు లాలూను, రేపు తేజస్వీని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రైల్వే హోటల్ల నిర్వహణను కాంట్రాక్టరు ఓ ప్రైవేటు సంస్థకు కట్టబెట్టిన వ్యవహారంలో అవినీతి జరిగిందని లాలూ ఆయన భార్య రబ్రీదేవి, తేజస్వీ సహా ఇతరులపైన సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది.