నా జీవిత భాగస్వామి ఫొటో ఇదే: భువనేశ్వర్

SMTV Desk 2017-10-04 16:07:45  criketer Bhuvneshwar Kumar, ipl match, criketer

న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ఈ మధ్య కొంతమంది క్రికెటర్లు ప్రేమాయణం సాగిస్తూ సామాజిక మాధ్యమంలో ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఇదే తరహాలో టీంమిండియా పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఎట్టకేలకు తన ‘మిస్టరీ గర్ల్’ ను చూపించేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ జరిగే సమయంలో ఓ రెస్టారెంట్లో తన గర్ల్‌ఫ్రెండ్‌తో కూర్చుని దిగిన ఫొటో షేర్ చేసి ‘డిన్నర్‌ డేట్‌.. త్వరలో పూర్తి ఫొటో విడుదల చేస్తా’ అంటూ తాను మాత్రమే కనిపించేలా సగం ఫోటోనే పోస్టుచేసి అభిమానులను డైలమాలో పడేశాడు. తాజాగా భువీ తన ట్విటర్‌లో ఆ మిగతా సగం ఫోటోను పోస్ట్ చేస్తూ... ‘నా జీవిత భాగస్వామి ఫొటో ఇదే’ అంటూ ఆమెను అందరికీ పరిచయం చేశాడు. ఆమె పేరు నుపూర్‌ అని భువీ తెలిపాడు. ప్రస్తుతం భువీ.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.