వాట్సప్ లో సరికొత్త ఎమోజిలు

SMTV Desk 2017-10-04 15:11:06  washington, whattsup emoji,Custom emoji

వాషింగ్టన్‌, అక్టోబర్ 4: సామాజిక మాధ్యమాల బాటలో ప్రముఖ సమాచార వేదిక వాట్సప్ చేరనుంది. త్వరలో కస్టమ్‌ ఎమోజీలను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఎమోజిలను బీటా వర్షన్ లో విడుదల చేయనున్నారు. తాజా అప్లికేషన్ లో భాగంగా సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లతో పాటు వాట్సప్ లో కూడా సరికొత్త ఎమోజిలు అందుబాటులోకి రావడం విశేషం. కానీ ఇవి యాపిల్‌ ఎమోజీలకు దగ్గరి పోలికలు కలిగి ఉన్నాయి. వాట్సప్‌ గతంలో ఒలింపిక్స్‌ వలయాల కోసం ఎమోజీని జోడించిన విషయం విధితమే.