నేడు పంచకుల కోర్టులో డేరాబాబా దత్తపుత్రిక

SMTV Desk 2017-10-04 13:38:02  Haryana Police arrest Honeypreet From, Punjab , Panchakula Court

చండీగఢ్, అక్టోబర్ 04 : డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ దత్త పుత్రిక హనిప్రీత్ ను హర్యానా పోలీసులు పంచకుల కోర్టులో నేడు హాజరు పరుచనున్నారు. గుర్మీత్ అరెస్టు తరువాత అజ్ఞాతంలో వెళ్లిన ఆమె కోసం అనేక చోట్ల గాలించిన పోలీసులు ఎట్టకేలకు పంజాబ్‌లోని జిరక్‌పూర్‌ - పటియాలా రహదారిపై అదుపులోకి తీసుకున్నవిషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో మహిళను కూడా అరెస్టు చేసినట్లు తెలిపిన పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్‌ చావ్లా ఆమెను నేడు కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అత్యాచార కేసులో గుర్మీత్ ను కోర్టు దోషిగా ప్రకటించిన అనంతరం ఆగస్టు 25న జరిగిన హింసలో హానిప్రీత్ ప్రమేయంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపిన ఆయన, ఆమె తప్పించుకునేందుకు సహకరించిన వారిని గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కాగా, హనీప్రీత్‌ నుంచి వీలైనంత కీలక సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ఆమెను బుధవారం తెల్లవారుజాము మూడుగంటల వరకు ప్రశ్నించినట్లు సమాచారం.