వర్షం కారణంగా రోడ్డుపై ఏర్పడ్డ భారీ గొయ్యి.

SMTV Desk 2017-10-04 13:32:48  Hyderabad, heavy rains, traffic problems, ghmc officers.

హైదరాబాద్, అక్టోబర్ 4 : నగరం మొత్తం భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ వర్షాల ధాటికి ప్రాంతాలన్నీ జలమయమైపోయి చెరువులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో హైదరాబాద్ నగరంలోని బేగంబజార్‌లో అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోయి ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి కింద నుండి కాలువ ప్రవహిస్తూ ఉంది కాని.. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని జీహెచ్ఏంసీ అధికారులు వెల్లడించారు. ట్రాఫిక్‌ పోలీసులు గొయ్యి ఏర్పడిన చోటు నుండి ట్రాఫిక్ ను మళ్ళించి దాని చుట్టూ బారికేడ్లను ఏర్పాటు చేసారు. అన౦తరం జీహెచ్‌ఎంసీ అధికారుల సహాయంతో మరమ్మత్తు పనులను చేపట్టారు. కాగా ఇలాంటి సంఘటనలపై ప్రయాణికులందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.