అక్రమ రవాణాదారు పొట్టలో బంగారు గుళికలు...

SMTV Desk 2017-10-04 13:14:49  Customs officers, Sri Lanka, KGH Hospital, rajak

విశాఖపట్నం, అక్టోబర్ 04 : కస్టమ్స్‌ కన్ను కప్పేందుకు కడుపులో బంగారు బిస్కెట్ దాచిన వ్యక్తి మలద్వారం నుంచి నేడు బయటకు వచ్చాయి. ఆదివారం శ్రీలంక నుంచి విమానంలో విశాఖకు వచ్చిన రజాక్‌ ను కస్టమ్స్‌ అధికారులు అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. అతని కడుపులో బంగారు బిస్కెట్లు ఉన్నట్లు స్కానింగ్ లో గుర్తించారు. ఆ తరువాత కేజీహెచ్‌ తరలించి వైద్యులు పరిధిలో ఉంచగా మంగళవారం రాత్రి 7, నేడు మరో 7 బంగారు బిస్కెట్లు బయట పడ్డాయి. ఈ మేరకు ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి జి. అర్జున మాట్లాడుతూ... మళ్లీ ఎక్స్‌రేలు తీసి, లోపల ఎలాంటి కవర్లూ లేవని నిర్దారించుకున్నాక సాయంత్రం రజాక్‌ను డిశ్చార్జి చేసి కస్టమ్స్‌ అధికారులకు అప్పగించనున్నట్లు ఆయన వివరించారు.