ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంతో...

SMTV Desk 2017-10-04 13:04:20  Jagethyala, government hospital, Neglect of doctors

జగిత్యాల, అక్టోబర్ 4 : జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో ఓ దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలలోకి వెళితే...కోరుట్లకు చెందిన ఓ మహిళ వారం రోజుల క్రితం ప్రసవం కోసం జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చేరింది. వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీశారు. వారం రోజుల తరువాత ఆమెకు కడుపు నొప్పి రావడంతో ఆ మహిళను జిల్లా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు సాధారణ నొప్పిగా నిర్ధారణ చేశారు. కానీ వాంతులతో పాటు కడుపునొప్పి తీవ్రమవడంతో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి ప్రసవ సమయంలో రక్త స్రావాన్ని నిలిపేందుకు ఉపయోగించిన గుడ్డ(మాపు) కడుపులోనే ఉంచి కుట్లు వేసినట్లు గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స ద్వారా ఆ గుడ్డను తొలగించి, వైద్యులు ఇచ్చిన ఆధారాలతో బాధితురాలి బంధువులు జిల్లా ఆసుపత్రి పర్యవేక్షణాధికారి అశోక్ కుమార్ ను కలిశారు. పని ఒత్తిడిలో ఆ వైద్యురాలు గుడ్డని మరిచిపోయి ఉండవచ్చని, ఈ విషయంపై వారు పోలీసుల వరకు వెళ్ళకుండా ఉండటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.