అగ్రిగోల్డ్ చైర్మన్ కు మూడేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించిన బద్వేల్ కోర్టు

SMTV Desk 2017-10-04 07:02:12  agrigoldchairman, maxcompany, badwel court, kadapa

కడప అక్టోబర్ 4 : అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావుకు మూడేళ్లు జైలు శిక్ష మరియు ఆరు వేలు జరిమానా విధిస్తూ కడప జిల్లా బద్వేలు న్యాయస్థానం సంచలన తీర్పును ప్రకటించింది. కడపజిల్లాలోని పోరుమామిళ్ల మండలం సిద్ధవరం భూముల వ్యవహారంలో అగ్రి గోల్డ్‌ ఛైర్మన్‌ వెంకటరామారావు మోసం చేశారని మ్యాక్స్‌ కంపెనీ పోరుమామిళ్ల పోలీస్‌ స్టేషన్‌నందు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు 2006లో కేసు నమోదైంది. ఈ కేసు విచారణ నిమిత్తం ప్రస్తుతం ఏలూరు జైలులో శిక్ష అనుభవిస్తున్న అవ్వా వెంకటరామారావును పోరుమామిళ్ల పోలీసులు మంగళవారం బద్వేలు కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారణలో ఆయన నేరం రుజువు కావడంతో ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.6 వేలు జరిమానా విధిస్తూ జూనియర్ సివిల్ జడ్జి శుభవల్లి తీర్పు వెలువరించారు. ఈ నేపథ్యంలో వెంకట రామారావును కడప సెంట్రల్ జైలుకు తరలించారు.