లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..

SMTV Desk 2017-10-03 19:00:19  Kingfisher chief, Vijay Mallya, arrest, Moneylender case.

లండన్, అక్టోబర్ 3 : భారతీయ బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు చేసి విదేశాలకు పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై మనీలాండరింగ్ కేసు న‌మోదైన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే మాల్యాకు చెందిన రూ.9,600 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఆయనను భారత్ రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ అధికారులందరూ విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు మాల్యాను లండన్ లో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయనను మరోసారి కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా విజయ్ మాల్యా అరెస్ట్ పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.