డేరా బాబా దత్తపుత్రిక అరెస్ట్

SMTV Desk 2017-10-03 18:54:39  Honeypreet Insan, Ram Rahims Daughter Arrested

పంచకుల, అక్టోబర్ 03 : డేరా బాబా గుర్మీత్ అరెస్ట్ తరువాత మరో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన దత్త పుత్రిక హానిప్రీత్ సింగ్ ను చండీగఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుర్మీత్ అరెస్టు తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఆమె కోసం అనేక చోట్ల గాలించిన పోలీసులు ఎట్టకేలకు జిరాక్‌పూర్‌-పటియాలా జాతీయ రహదారిపై అదుపులోకి తీసుకున్నారు. ఆమెను బుధవారం కోర్టులో ప్రవేశ పెడుతున్నట్లు పంచకుల పోలీస్ కమిషనర్ ఏఎస్‌ చావ్లా తెలిపారు. ఆగస్టు 25 నాటి హింసలో ఆమె ప్రమేయంపై విచారణ జరుగుతుందని తెలిపిన ఆయన ఇన్నాళ్లు హానిప్రీత్ తప్పించుకునేందుకు సహకరించిన వారిని గుర్తిస్తామని స్పష్టం చేశారు.