నిందితులు దొరికారు కానీ...

SMTV Desk 2017-10-03 17:18:39  gauri lankesh, karnata government, karnataka home minister, ramalinga reddy,

బెంగుళూర్, అక్టోబర్ 3: ఇటీవల నగరంలో లేడి జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్య దుమారం రేపింది. సెప్టెంబర్ 5న గౌరీ లంకేశ్‌ను దుండగులు ఆమె ఇంటిముందు కాల్చి చంపారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయినప్పటికీ ఇంతవరకు నిందితులను అదుపులోకి తీసుకోలేదని గౌరీ లంకేశ్ సోదరుడు, నటుడు ప్రకాష్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ హత్యకు సంబంధించి కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన ప్రకటన చేసింది. ఆమెను హత్య చేసిన నిందితులను గుర్తించామని, వాళ్లను దోషులుగా నిర్ధారించే౦దుకు ఇంకా ఆధారాలు కావాలని, వాటిని సేకరించే పనిలో ఉన్నామని కర్నాటక హోంమంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. అందుకే వారి వివరాలను బయట పెట్టబోమని అన్నారు. ఇప్పటికే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారని తెలిపారు.