వీడియో చూస్తే వినోదం..కానీ ఏకంగా సినిమా టికెట్లు..

SMTV Desk 2017-10-03 16:37:01  Qbucks app, Qbucks, nagesh juloori,

న్యూఢిల్లీ, అక్టోబర్ 3: ఏదైనా వీడియో చూస్తే కాస్త వినోదం, వీలైతే విజ్ఞానం లభిస్తుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. వీడియో చూస్తే ఫ్రీగా సినిమా టికెట్లు, పిజ్జాలు, పెటియం క్యాష్ వంటి నూతన ఆఫర్లను ప్రవేశపెడితే ఎంత బావుంటుందో కదా!..ఈ తరహాలో ‘క్యూబక్స్‌’ అనే స్టార్టప్‌ ఈ వినూత్న వ్యాపారాన్ని ఎంపిక చేసుకుంది. నగేష్ అనే తెలుగు యువకుడు ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. అనాది కాలంలోనే విశేష ఆదరణ పొందిన ఈ యాప్‌ను 2లక్షల మంది డౌన్‌లోడ్‌ చేసుకుని వీక్షించి పాయింట్లు సంపాదిస్తున్నారు. ఈ స్టార్టప్‌ సంబంధించి ప్రతి రోజు నాలుగు వీడియోలు యాప్‌లో పొందుపరుచుతారు. వాటిని యూజర్‌ చూడాలి. అదే సమయంలో వీడియోకి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సరైన సమాధానం చెబితే పాయింట్లు అందిస్తారు. అలా వచ్చిన పాయింట్లను మూవీ టికెట్లుగా, పిజ్జాలు, ఇతర వస్తువులు, పేటీఎం క్యాష్‌గా పొందవచ్చు. అలా ఇవ్వడం వల్ల వారికేం ప్రయోజనం అనుకుంటున్నారా? ఆయా యూట్యూబ్‌ చానల్స్‌ ప్రమోషన్‌, వీడియో ప్రమోషన్‌ ద్వారా నిర్వాహకులకు లాభం చేకూరుతుంది. త్వరలో లైవ్‌ టీవీ, లైవ్‌ రేడియోని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారట. వాటిని చూసినా పాయింట్లు సంపాదించుకోవచ్చని వ్యవస్థాపకుడు నగేష్‌ జూలూరి చెబుతున్నారు. ఇప్పుడు వీడియోను చూస్తూ వినోదాన్ని పొందడమే కాకుండా, కూర్చున్న చోటే సంపాదించడం కూడా సులువైంది.