రూ.2 కోట్ల వ్యయంతో మోడల్‌ పోలీసు స్టేషన్‌

SMTV Desk 2017-10-03 16:03:11  Narasarau Peta, Model police station, DGP Nanduri Sambasivaravu, Legislative Actor Kodela Shivprasadasrao

గుంటూరు, అక్టోబర్ 03 : గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో రూ.2 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన 1వ పట్టణం మోడల్‌ పోలీసు స్టేషన్‌ను డీజీపీ నండూరి సాంబశివరావు, శాసనసభాపతి కోడెల శివప్రసాదరావు లు ప్రారంభించారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి శాంతికి చిహ్నమైన కపోతాలను ఎగురవేశారు. నూతన రాజధానిలో పోలీసులు మరింత బాధ్యతగా ఉండాలని అధునాతన పరిజ్ఞానాన్ని వాడుకోవాలని సభాపతి సూచించారు. డీజీపీ నరసరావుపేటలో మహిళ పోలీస్ స్టేషన్, ట్రాఫిక్ స్టేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శివప్రసాదరావును కోరారు.