15 రోజుల పెరోల్ కు దరఖాస్తు చేసుకున్న శశికళ

SMTV Desk 2017-10-03 13:08:26  Shashikala, Parole, natarajan, dinakaran, hospital

చెన్నై, అక్టోబర్ 03 : అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న శశికళ పెరోల్‌ కోసం దరఖాస్తూ చేసుకున్నారు.... అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో ఉన్న తన భర్త నటరాజన్‌ ను కలిసేందుకు వీలు కల్పిస్తూ 15 రోజుల పెరోల్ ఇవ్వాలని జైలు శాఖను ఆమె కోరినట్టు శశికళ మేనల్లుడు దినకరన్ తెలిపారు. గత కొంతకాలంగా నటరాజన్ కాలేయ సమస్యతో బాధ పడుతున్నట్లు, త్వరలో ఆయనకు కాలేయ మార్పిడి జరగనుందని దినకరన్ వివరించారు. శశికళకు తప్పకుండా పెరోల్ వస్తుందని ధీమా వ్యక్తం చేసిన ఆయన, ఎంత కాలం అనుమతిస్తారన్నది జైలు శాఖ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. అక్రమాస్తుల కేసులో శశికళ బెంగళూరు జైల్లో నాలుగేళ్ల శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.