సంచలనాత్మకమైన జనసేన పార్టీ ట్వీట్..

SMTV Desk 2017-10-03 12:09:16  janasena party, pavankalyan, twitter, elections.

అమరావతి, అక్టోబర్ 3 : జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ఓ ట్వీట్ దుమారం రేపింది. ఏ అంశం గురించి అయిన ట్విట్టర్ వేదికగా స్పందించే జనసేన పార్టీ.. నిన్న చేసిన ఓ ట్వీట్‌ వల్ల రాజకీయపరంగా పలు ఊహాగానాలకు తెర లేపింది. వచ్చే ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాల్లోనూ జనసేన పోటీ చేయనుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నట్టుగా.. జనసేన ట్విట్టర్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారు. ఏ పార్టీతో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా జనసేన పార్టీనే సొంతంగా పోటీ చేస్తుందా.? అని పలు అనుమానాలకు దారి తీసేలా ఉన్న ఆ ట్వీట్.. విస్తృతంగా ప్రచార౦ అవుతోంది. ఇటీవల జరిగిన శతఘ్ని డిజిటల్‌ రెజిమెంట్‌ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను, అక్కడి ప్రతినిధి ఒకరు వచ్చే ఎన్నికల్లో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందా? అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు పవన్ బదులిస్తూ.. అప్పటి పరిస్థితులను బట్టి ఓ నిర్ణయ౦ తీసుకుంటామన్నారు. ఈ విషయంపై జనసేన ప్రతినిధులు స్పందిస్తూ.. ఎన్నికల గురించి ఎలాంటి చర్చ జరగలేదని, కొత్తగా పార్టీ సోషల్ మీడియా గ్రూప్ లో చేరిన ఓ వ్యక్తి పవన్ మాటలను పొరపాటుగా అర్ధం చేసుకోవడమే దీనికి కారణమని తెలిపారు.