‘అల్లాఉద్దిన్‌ ఖిల్జి’ ఫస్ట్‌లుక్‌ విడుదల

SMTV Desk 2017-10-03 11:54:06  deepika padukone, padmavathi first look, sanjayleela bhansali, shahid kapoor, ranaveer singh

ముంబాయి, అక్టోబర్ 3: సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో దీపిక పదుకొణె ప్రధాన పాత్రలో ‘పద్మావతి’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని చిత్తోర్‌ఘడ్‌ రాణి పద్మావతి జీవితం ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రాణి పద్మావతి, ఆమె భర్త మహారావల్‌ రతన్‌ సింగ్‌ ఫస్ట్‌లుక్‌లు విడుదలయ్యాయి. రాణి పద్మావతిగా దీపిక పదుకొణె, ఆమె భర్తగా షాహిద్‌ కపూర్‌ లుక్ ఇటు నెటిజన్లను అటు అభిమానులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ నటించగా అభిమానులు ఆయన లుక్ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణంలో తాజాగా చిత్ర బృందం ‘అల్లాఉద్దిన్‌ ఖిల్జి’ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది. పొడవాటి జుట్టు, కంటి కింద గాటుతో రణ్‌వీర్‌ ‘ఖిల్జి’ గెటప్‌లో అదరగొట్టేశాడు. ఇప్పటికే ఈ ఫస్ట్‌లుక్‌ ట్విటర్‌లో ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నారు.