సూర్య, చంద్రప్రభ వాహనాలపై ఊరేగిన... శ్రీనివాసుడు

SMTV Desk 2017-09-30 06:04:25  tirumula, suryaprabhvhanaseva, chandraprabhavahanaseva

తిరుమల, సెప్టెంబర్ 30: తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు శుక్రవారం తిరుమలలో ప్రత్యక్ష దైవాలైన సూర్య, చంద్రులను వాహనాలుగా చేసుకుని స్వామివారు ఊరేగారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై తిరు వీధి ప్రదక్షిణలో స్వామివారు వేలాది భక్తులను కటాక్షించారు. ఆ పై రాత్రి పూట స్వామివారు చంద్రప్రభ వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరించారు. తిరుమలకు వేలాదిమంది భక్తులు స్వామి వారి వాహన సేవను వీక్షించేందుకు భారీగా తరలి వచ్చారు. ఈ వాహన సేవలో తితిదే చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈ వో సింఘాల్‌, పలువురు తితిదే అధికారులు పాల్గొన్నారు.