సౌదీఅరేబియా నిర్ణయాన్ని స్వాగతించిన ట్రంప్

SMTV Desk 2017-09-27 15:10:23  Saudi Arabia, Womens, Car Driving, Tramp

రియాద్‌, సెప్టెంబర్ 27: మహిళల జీవన విధానం సహా వారి అవకాశాలు, హక్కుల విషయంలో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్న సౌదీఅరేబియా తొలిసారిగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో మహిళలను వాహనాలను నడిపేందుకు అనుమతించని ఏకైక దేశంగా ఉన్న సౌదీఅరేబియా తొలిసారిగా ఆ ముద్రను తొలగించుకొబోతుంది. ఆ దేశ మహిళలు సుదీర్ఘ కాలంగా చేస్తున్న డిమాండ్ ను నెరవేరుస్తూ వచ్చే ఏడాది వేసవి నుంచి వారిని వాహనాలు నడిపేందుకు అనుమతిస్తూ ఆ దేశ రాజు సల్మాన్ అతని కుమారుడు దేశ యువరాజైన మహమ్మద్ బిన్ సుల్తాన్ లు నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో రాజధాని రియాద్ లోని జాతీయ స్టేడియంలో జరిగే క్రీడోత్సవాలకు మహిళలను అనుమతించి ఈ నిర్ణయం అమలుకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో సౌదీ నిర్ణయాన్ని అమెరికా డోనాల్డ్ ట్రంప్ స్వాగతించారు. మహిళల అవకాశాలు, హక్కుల దిశగా ఇది సానుకూల నిర్ణయమని ట్రంప్ ప్రశంసించారు.