రాజ్ నాథ్ విజ్ఞక్తి పై స్పందించిన జీజేఎం నేతలు

SMTV Desk 2017-09-27 14:03:40  Darjiling, Gorkha State, Union Home Minister Rajnath Singh, GJM supremo Bimal Gurung

దార్జీలింగ్, సెప్టెంబర్ 27 : ప్రత్యేక గోర్ఖా లాంటి రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తో బంగాల్ లోని దార్జీలింగ్ లో 104 రోజులుగా జరుగుతున్న బంద్ ఎట్టకేలకు ముగిసింది. జూన్ 15న ప్రారంభించిన బంద్ ను కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ విజ్ఞప్తి మేరకు ఈ ఉదయం 6 గంటల నుంచి విరమించినట్లు గోర్ఖా జనముక్తి మోర్చా ప్రకటించింది. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో చేస్తున్న ఆందోళనలు విరమించాలని మంగళవారం రాజ్ నాథ్ సింగ్ జీజేఎం నేతలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్య పరిష్కారానికైనా చర్చలే మార్గమన్న ఆయన ఆ దిశగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శికి సూచించారు. రాజ్ నాథ్ విజ్ఞప్తి పై కొద్ది గంటలకే స్పందించిన జీజేఎం నేతలు బంద్ ను విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మొత్తం వ్యవహారంపై బంగాల్ ప్రభుత్వం పెదవి విరిచింది. పేరుకు బంద్ జరుగుతున్నా, గత వారం రోజులుగా దార్జీలింగ్ లోని దాదాపు అన్ని దుకాణాలు యేధావిధిగా పని చేస్తున్నాయని ఆ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పింది. జీజేఎం అధినేత బిమల్‌ గురుంగ్‌ పరువు నిలబెట్టేందుకే కేంద్రం ఈ తత్తంగం నడిపించిందని టీఎంసీ సర్కార్ విమర్శించింది.