జగన్‌ భార్య భారతీరెడ్డికి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

SMTV Desk 2017-09-27 13:44:56  YS Congress Party leader Jaganmohan Reddy, Wife Bharathi reddy, Non bailout warrant

అమరావతి, సెప్టెంబర్ 27: వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు తనపై కాల్ మనీ కేసులో అసత్యపు వార్తలను ప్రచురించారంటూ నూజివీడు కోర్టులో సాక్షి దినపత్రికపై పరువునష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి సాక్షి ఎండీ భారతీరెడ్డి, ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తిలకు సమన్లు జారీ చేసినప్పటికీ వారు కోర్టుకు హాజరు కాకపోవడంతో, న్యాయస్థానం వీరిరువురిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.