సింగపూర్ పర్యటనకు అమరావతి రైతులు

SMTV Desk 2017-09-27 13:04:29  Farmers, Visit Singapore, CRDA

అమరావతి, సెప్టెంబర్ 27 : రైతులే ముందు కార్యక్రమాల్లో భాగంగా రాజధానికి భూములిచ్చిన రైతుల్ని సింగపూర్ సందర్శనకు తీసుకెళ్లనున్నారు. అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను చూసేందుకు ఆసక్తిగా ఉన్న వారి నుంచి సీఆర్‌డీఏ దరఖాస్తులు ఆహ్వానించింది. వంద మంది రైతులను మూడు విడుతలుగా సింగపూర్ పర్యటనకు తీసుకువెళ్లడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 22 నుంచి 26 వరకు మొదటి బృందం, నవంబర్ 5 నుంచి 9 వరకు రెండో బృందం, నవంబర్ 19 నుంచి 23 వరకు మూడో బృందం సింగపూర్ పర్యటించనుంది. రైతులు పొందే నివాస వాణిజ్య ప్లాట్లను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవచ్చో పర్యాటక ద్వారా అవగాహన కలుగుతుందని సీఆర్‌డీఏ అధికారులు అంటున్నారు. ఈ పర్యటనకు అవసరమయ్యే రాకపోకలు వసతులు, బస్సు సదుపాయాలను సీఆర్‌డీఏ కల్పించనున్నారు.