ప్రధాని మోదీతో అమెరికా రక్షణమంత్రి మ్యాటిస్‌

SMTV Desk 2017-09-27 12:35:04  US Defense Secretary James Matis, Prime Minister Narendra Modi, Defense Minister Vimalasitha Raman, delhi, meeting

న్యూఢిల్లీ, సెప్టెంబర్ : ఉగ్రవాదంపై పోరు సహా ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో శాంతి స్థిరత్వం కోసం మరింత కలిసి కట్టుగా పని చేయడంపై భారత్, అమెరికా దేశాలు దృష్టి పెట్టాయి. రెండు రోజుల భారత పర్యటన భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ తో ఢిల్లీలో సమావేశమైన అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌ ఈ మేరకు చర్చలు జరిపారు. జూన్ లో అమెరికా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో జరిపిన విస్తృత ఫలప్రదమైన చర్చల్ని మోదీ గుర్తు చేశారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి నాటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు అమలు పురోగతిని జేమ్స్‌ మ్యాటిస్‌ మోదీకి నివేదించారు. అంతకుముందు రక్షణమంత్రి నిర్మల సీతారామన్ తో సమావేశమైన అమెరికా రక్షణమంత్రి, భారత్ కు అధునాతన రక్షక సాంకేతిక సహా ఆ రంగంలో బలోపేతంపై చర్చించారు.