త్వరలో విడుదలవనున్న విక్రమ్‌, సమంత ల చిత్రం

SMTV Desk 2017-09-26 23:51:06  10, 10 yedrathukulla, vikram, chiyan, samantha, charmi

హైదరాబాద్‌ సెప్టెంబర్ 26: తమిళంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘10 ఎండ్రత్తుకుల్ల’చిత్రం 2015 లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో విక్రమ్‌,సమంత జంటగా నటించారు. ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగు లో అనువాదం చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ‘10’ అనే టైటిల్‌ను చిత్రానికి ఖరారు చేశారు. త్వరలోనే ట్రైలర్‌,ఆడియోను విడుదల చేస్తామని చెప్పారు. అనువాద కార్యక్రమాలన్ని పూర్తిచేసి చిత్రాన్ని అక్టోబరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో ఛార్మి ప్రత్యేక పాత్రలో నటించారు. ఎ.ఆర్‌. మురుగదాస్‌ నిర్మించిన ఈ చిత్రానికి విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వం వహించారు. శ్రీ సుబ్రమణ్యేశ్వర సినీ క్రియేషన్స్‌ పతాకంపై తెలుగులో విడుదల చేస్తున్నారు.