యువతిపై సామూహిక అత్యాచారం...

SMTV Desk 2017-09-26 18:35:58  prakasam, kanigiri,

ప్రకాశం, సెప్టెంబర్ 26: ముగ్గురు కామాంధులు ఓ యువతిని టార్గెట్ చేశారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కనిగిరిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో విద్యార్ధిని డిగ్రీ చదువుతున్న సమయంలో సాయి, అనిల్, కార్తీక్ లు పరిచయమయ్యారు. వీరిలో కార్తీక్ ఆమెను ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. తన ప్రేమను తిరస్కరించడంతో ఆమెను ఎలాగైనా లోబరుచుకోవాలనే ఉద్దేశంతో స్నేహితులతో కలిసి వ్యూహం రచించాడు. మాట్లాడుకుందాం రా..! అంటూ పిలిచి ఆ యువతిపై స్నేహితులతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఈ దృశ్యాలను ఫోన్ లో చరవాణిలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అసలు విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు.