బాలీవుడ్ భామను కలిసిన టాలీవుడ్ బ్యూటీ

SMTV Desk 2017-09-26 15:53:13  Heroine Priyanka Chopra, Nayanatara, Global Goals

న్యూయార్క్, సెప్టెంబర్ 26 : బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా ఇటీవల "గ్లోబల్ గోల్స్" అవార్డుల స్వీకారోత్సవ౦ నిమిత్తం న్యూయార్క్ వెళ్ళింది. మరో పక్క నయనతార తన ప్రియుడు విఘ్నేశ్ శివన్ బర్త్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా ఆయనతో కలిసి న్యూయార్క్ వెళ్ళగా, అక్కడ ప్రియాంకను కలిసింది. ఈ ఇరువురు భామలు ఒకరికొకరు పలకరించుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అన౦తరం అమెరికా జీవన విధానంతో పాటు పలు అంశాలపై మాట్లాడుకున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ప్రియాంక, నయన కలిసి దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఇప్పుడవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.